అమ్మ కోసం
అమ్మ కోసం Artist: స్వప్న ఎడ్వర్డ్స్ ఏ భాషకందని భావం నీవువెలకట్టలేని ముత్యం నీవుదేవుడిచ్చిన వరమే నీవు – తీర్చలేని ఓ ఋణంఎదలో దాగిన పలుకే నీవు – నా ప్రేమకు తొలిరూపంఅమ్మా నిను మించిన బంధం ఏదియు లేదేలోకంలో ఈ తియ్యని బంధం కానరాలేదే నవ మాసాలు నీలో నన్ను దాచావునా ఊపిరికై నీ ప్రాణం పణంగా పెట్టావురేయి పగలంతా నాకై శ్రమపడినాతీరని అనురాగం నీలో చూసానేనీ సుఖ సంతోషం విడచిన నాకైతరగని మమకారం నీలో దాచావేయేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించిందేఅమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదేలోకంలో ఈ తియ్యని బంధం కానరానే లేదే భయ భక్తులే ఉగ్గి పాలగ పోసావుదేవుని మాటలే గోరు ముద్దగ చేసావుతప్పటడుగులే నాలో సరి చేసిప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగ నిలిపావుప్రతి వేకువలో నాకై నీవుచేసే ప్రార్థనలే పెంచెను నా బలమేనీలో కలిగిన విశ్వాసం నాతో సహవాసించెనేఅమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదేలోకంలో ఈ తియ్యని బంధం కానరానే లేదే ||ఏ భాషకందని||