అదిగదిగో అల్లదిగో
అదిగదిగో అల్లదిగో Artist: No Details అదిగదిగో అల్లదిగోకల్వరి మెట్టకు దారదిగోఆ ప్రభువును వేసిన సిలువదిగో ||అదిగదిగో|| గెత్సేమను ఒక తోటదిగోఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో (2)అచటనే యుండి ప్రార్ధించుడని (2)పలికిన క్రీస్తు మాటదిగో (2) ||అదిగదిగో|| శిష్యులలో ఇస్కరియోతుయూదాయను ఒక ఘాతకుడు (2)ప్రభువును యూదులకప్పగింప (2)పెట్టిన దొంగ ముద్దదిగో (2) ||అదిగదిగో|| లేఖనము నెరవేరుటకైఈ లోకపు పాపము పోవుటకై (2)పావనుడేసుని రక్తమును గల (2)ముప్పది రూకల మూటదిగో (2) ||అదిగదిగో|| చలి కాచుకొను గుంపదిగోఆ పేతురు బొంకిన స్థలమదిగో (2)మూడవసారి బొంకిన వెంటనే (2)కొక్కొరొకోయను కూతదిగో (2) ||అదిగదిగో|| యూదుల రాజువు నీవేనామోదముతో నీవన్నట్లే (2)నీలో దోషము కనుగొనలేక (2)చేతులు కడిగిన పిలాతుడాడుగో (2) ||అదిగదిగో|| గొల్గొతా స్థల అద్దరినిఆ ఇద్దరు దొంగల మధ్యమున (2)సాక్షాత్తు యెహోవా తనయుని (2)సిలువను వేసిరి చూడదిగో (2) ||అదిగదిగో|| గొల్లున ఏడ్చిన తల్లదిగోఆ తల్లికి చెప్పిన మాటదిగో (2)యూదుల రాజా దిగి రమ్మనుచు (2)హేళన చేసిన మూకదిగో (2) ||అదిగదిగో|| దాహము గొనుచున్నాననుచుప్రాణము విడిచెను పావనుడు (2)పరిశుద్ధుడు మన రక్షకుడేసు (2)మన మది యేమో గమనించు (2) ||అదిగదిగో||