అడిగినది కొంతే అయినా
అడిగినది కొంతే అయినా Artist: క్రాంతి చేపూరి అడిగినది కొంతే అయినాపొందినది ఎంతో దేవాప్రతిగా ఏమివ్వగలనయానిను స్తుతియించే హృదయము తప్పనా జీవితం నీకే అంకితమయ్యా – (4) ||అడిగినది|| ఊహించలేని వివరింపజాలనినీ కార్యములు ఆశ్చర్యమేయోచించినా నా వర్ణనకందనినీ కృపా కనికరములు అత్యున్నతమేతరతరములకు మారని నీ ఉన్నత ప్రేమాయుగయుగములకు నీకే ఘనతా మహిమాసతతం నిను నే కొనియాడెదనుసకలం నీ నామముకే స్తోత్రము తగును ||అడిగినది|| క్షణ భంగురం నా క్షయ జీవితంకాచావయ్యా నను నీ రెక్కల నీడఏ యోగ్యత లేని అల్పురాల నన్నుహెచ్చించావయ్యా నీ ప్రేమ తోడనా ఆశ్రయ దుర్గము నీవే యేసయ్యనా రక్షణ శృంగము నీవే మెస్సయ్యనా స్తుతికి పాత్రుడవు నీవేనయ్యాఈ స్తోత్ర కీర్తన నీకేనయ్యా ||అడిగినది|| మహిమోన్నతుడా నను మరువని విభుడాప్రణుతించెదను నిన్నే నిరతంనిష్కలంకుడా నిర్మలాత్ముడాప్రకటించెదను నీ పావన చరితంనా అతిశయము నీవే నా యేసయ్యానా ఆధారము నీవే నా మెస్సయ్యానా ఆరాధన ఆలాపన నీకేనయ్యాఈ దీన సేవను చేకొనుమయ్యా ||అడిగినది||