AltarVision Header
AltarVision

నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా

Artist: ఏ ఆర్ స్టీవెన్సన్

నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా
నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా (2)
మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా
కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా ||నీకంటె||

కొట్టబడిన వేళ
నా గాయం కట్టినావే (2)
బాధించినా స్వస్థపరిచేది నీవే (2) ||నీకంటె||

అణచబడిన వేళ
నా తలను ఎత్తినావే (2)
శిక్షించినా గొప్ప చేసేది నీవే (2) ||నీకంటె||

విడువబడిన వేళ
నను చేరదీసినావే (2)
కోపించినా కరుణ చూపేది నీవే (2) ||నీకంటె||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *